Wednesday, 24 December 2025

రామాయణంలో అగస్త్య ఋషి

 


అగస్త్య ఋషి అంటే, వింధ్య పర్వతం పెరగకుండా ఆపారు - అగం (పర్వతం) స్తంభయతీతి అగస్త్య:- కాబట్టి, అగస్త్యుడు అనే ఆలోచన ప్రాచుర్యంలో ఉంది.


వింధ్య పర్వతం పెరగకుండా ఆపడమనే కథ మహాభారతంలోని వనపర్వంలోను,  పురాణాలలో కనిపిస్తుంది.  


ఐతే, రామాయణంలో అరణ్యకాండలో అగస్త్యుని ప్రస్తావన కనిపించినా, అక్కడ ఈ కథ కనిపించదు.


అగస్త్యుని సోదరుని ఆశ్రమం గురించి చెబుతూ, అగస్త్యుని గురించి వాల్మీకి చెప్పినది.


నిగృహ్య తపసా మృత్యుం లోకానాం హితకామ్యయా। 

యస్య భ్రాత్రా కృతేయం దిక్ఛరణ్యా పుణ్యకర్మణా।||3.11.55


అనేక పుణ్యకర్మలు ఎవరైతే చేసారో, లోకక్షేమం కోసం ఎవరైతే మృత్యువును జయించారో, ఎవరైతే ఈ ప్రాంతం నివాసయోగ్యంగా మార్చారో, ఆ అగస్త్యుని సోదరుని ఆశ్రమమే ఇది.


---


జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ వాల్మీకి ఋషి అగస్త్యుని గురించి లోకక్షేమం కోసం మృత్యువును జయించారునిగృహ్య తపసా మృత్యుం - అని చెప్పారు.


ఇంకొక విషయమేమంటే, అగస్త్య ఋషి స్తోత్రాలు ఋగ్వేదంలో కూడా కనిపిస్తాయి.


---


నాకు అర్థమైనదిది.


సంస్కృతంలో అగతి అంతే ఆపడం అనే అర్థం వస్తుంది.  సంస్థాన్ అంటే అనేక అర్థాలతో పాటు మరణం అనే అర్థం ఉంది.


బహుశా  మృత్యువును జయించడం - అగతి సంస్థానం  నుండి అగస్త్య అనే పేరు వచ్చిందేమో!

No comments:

Post a Comment