Showing posts with label G.02 ఋగ్వేదంలో ఇంద్రుని వర్ణన. Show all posts
Showing posts with label G.02 ఋగ్వేదంలో ఇంద్రుని వర్ణన. Show all posts

Monday, 31 August 2015

ఋగ్వేదంలో ఇంద్రుని వర్ణన

వేదములలో ఇంద్రునికి సర్వకర్తృత్వ సర్వనియామకత్వములు నిరూపించబడినవి.

క్రింద వ్రాసినవి స్వర్గీయ శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారి "షోడశి - రామాయణ రహస్యములు" అనే పుస్తకములోనివి (పేజి 168).

"ఈశానో అప్రతిష్కుత ఇంద్రో అంగ"
(ఋ.1 మం. 13 అను 84 నూ.891 మం.)

ఎదురాడ శక్యము కానివాడై ఇంద్రుడు సర్వజగమునకు ఈశ్వరుడు.


త మీశానం జగత స్తస్ఠుషస్పతి ధియం జిన్వ మవసే హోమహేవయం...."
(ఋ.1 మం. 14 అను 59 నూ.943 మం.)

ఐశ్వర్యవంతుడు స్థావరజంగమాత్మక జగత్తునకు పతియు, కర్మలందు ప్రీతికలవాడు నగు ఆ ఇంద్రుని మా రక్షకై పిలుచుచున్నాము.