బాలకాండలోని 5వ సర్గలో ఇలా ఉంది.
----
ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనామ్ ।
మహదుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతమ్ ।।1.5.3।।
ఎందరో గొప్ప మహారాజులు పుట్టిన ఇక్ష్వాకువంశంలో జన్మించిన రాముని చరితమే ఈ రామాయణము.
తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదిత: ।
ధర్మకామార్థసహితం శ్రోతవ్యమనసూయయా ।।1.5.4।।
ధర్మకామార్థములను ప్రతిపాదించు ఈ రామాయణమును ప్రవర్తింపజేయుదును. దీనిని ఎట్టి దోష దృష్టియు లేకుండ వినవలసినది.
----
ఇక్కడ తదిదం వర్తయిష్యామి - ఈ రామాయణమును ప్రవర్తింపజేయుదును అనేది గమనిస్తే, ఈ కావ్యకర్త పేరు చెప్పలేదని గమనించవచ్చును.
---
చిత్రకూటంలో శ్రీరామ, సీతా, లక్ష్మణులు వాల్మీకి ఋషిని కలసినట్లు, అయోధ్యకాండలో ఉంది.
ఇతి సీతా చ రామశ్చ లక్ష్మణశ్చ కృతాఞ్జలిః।
అభిగమ్యాఽశ్రమం సర్వే వాల్మీకి మభివాదయన్।।2.56.16।।
పిదప సీతారామలక్ష్మణులు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకేగి, దోసిలియొగ్గి, ఆ మునీశ్వరునకు ప్రణమిల్లిరి.
---
నా సందేహం.
రామాయణ కావ్యకర్త వాల్మీకి మహర్షియే ఐతే, సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో నన్ను కలిసారు అని చెబుతారుగానీ, వాల్మీకి మహర్షిని కలిసారు అని ఎందుకు చెబుతారు?
No comments:
Post a Comment