Monday, 31 August 2015

ఋగ్వేదంలో ఇంద్రుని వర్ణన

వేదములలో ఇంద్రునికి సర్వకర్తృత్వ సర్వనియామకత్వములు నిరూపించబడినవి.

క్రింద వ్రాసినవి స్వర్గీయ శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారి "షోడశి - రామాయణ రహస్యములు" అనే పుస్తకములోనివి (పేజి 168).

"ఈశానో అప్రతిష్కుత ఇంద్రో అంగ"
(ఋ.1 మం. 13 అను 84 నూ.891 మం.)

ఎదురాడ శక్యము కానివాడై ఇంద్రుడు సర్వజగమునకు ఈశ్వరుడు.


త మీశానం జగత స్తస్ఠుషస్పతి ధియం జిన్వ మవసే హోమహేవయం...."
(ఋ.1 మం. 14 అను 59 నూ.943 మం.)

ఐశ్వర్యవంతుడు స్థావరజంగమాత్మక జగత్తునకు పతియు, కర్మలందు ప్రీతికలవాడు నగు ఆ ఇంద్రుని మా రక్షకై పిలుచుచున్నాము.

No comments:

Post a Comment