శ్రీమద్రామాయణం ఎవరి కోసం? అనే ప్రశ్నకి వద్దాం!
ఎవరి ప్రశ్నలకైనా, ఎటువంటి సమస్యకైనా శ్రీమద్రామాయణంలో సమాధానం దొరుకుతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి అందరి కోసం అని చెప్పవచ్చునా?
నిజమే!
అయితే శ్రీమద్రామాయణం ప్రధానంగా క్షత్రియవంశాల కోసమే వ్రాయబడినదని నా నమ్మకం. కొంచెం వివరంగా ఆలోచిద్దాము!
చాల కాలంగా మన దేశంలో ప్రభువులకు, సామాన్య ప్రజలకు ఆశ్రమవాసులైన ఋషులు మార్గదర్శనం చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఋషులు మన దేశానికి ధర్మమనే పునాదిగా ఉండేవారు.
ఆ పునాదిని ఆధారం చేసుకునే, క్షాత్రమున్న క్షత్రియులు ధర్మబద్ధంగా సువిశాల సామ్రాజ్యాలను నిర్మించుకుని, ప్రజారంజకులుగా పరిపాలన చేసేవారు.
దేశపాలన చేసే క్షత్రియులకు సలహాలిచ్చే మంత్రుల వ్యవస్థ, దేశ రక్షణకు సైన్య, గూఢాచారి వ్యవస్థలు కావాలి. అందుకు రాజు పాలనలోని మిగిలిన వర్ణాలవారు వారి ఆర్జనలో 1/6వ వంతు పన్ను కట్టేవారు.
అధర్మస్తు మహాం స్తాత భవేత్ తస్య మహీపతే:|
యో హతేద్బలిషడ్భాగం న చ రక్షతి పుత్త్రవత్ || (శ్రీమద్రామాయణం, అరణ్యకాండ, 6వ సర్గ, 11వ శ్లోకము)
"ప్రజలను కన్నబిడ్డలవలె కాపాడుచుండుట రాజు యొక్క కర్తవ్యము. ప్రజల ఆదాయమున ఆఱవవంతు ధనమును పన్నుగా స్వీకరించుచు వారిని ఆదుకొనని రాజు అధర్మపరుడు గదా!"
ఐతే రాజ్యంలో భాగాలైన అరణ్యాలలో ఉన్న ఆశ్రమవాసులైన ఋషుల రక్షణ భారం మాత్రం రాజుదే! వారు మాత్రం పన్ను కట్టేవారు కారు. కేవలం తపస్సు చేసుకుంటు, అప్పుడప్పుడు రాజులకు సలహాలివ్వడం మాత్రమే చేసేవారా అంటే కాదు.
ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజలను కాపాడే రాజుకు, ఋషులు చేసే యజ్ఞాది క్రతువుల వల్లను, జప, ధ్యానాదుల వల్లను, తపస్సుల ద్వారాను వచ్చే శక్తిలో 4వ భాగం వచ్చి చేరుతుంది. అదే వారు రాజుకు కట్టే పన్ను!
యత్ కరోతి పరం ధర్మం మునిర్మూలఫలాశన:|
తత్ర రాజ్ఞశ్చతుర్భాగ: ప్రజా ధర్మేణ రక్షత: || (శ్రీమద్రామాయణం, అరణ్యకాండ, 6వ సర్గ, 14వ శ్లోకము)
యత్ కరోతి పరం ధర్మం మునిర్మూలఫలాశన:|
తత్ర రాజ్ఞశ్చతుర్భాగ: ప్రజా ధర్మేణ రక్షత: || (శ్రీమద్రామాయణం, అరణ్యకాండ, 6వ సర్గ, 14వ శ్లోకము)
కాబట్టి ఆనాడైనా, ఈనాడైనా ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజలను కాపాడే రాజు అందరికి మార్గదర్శకుడు, రక్షకుడు !
------------------
------------------
ముందు అనుకున్నట్లుగా శ్రీమద్రామాయణం ప్రధానంగా రాజుల కొఱకు వ్రాయబడినదని నా అభిప్రాయం.
ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో స్థూలంగా ఋషులు చెప్పగలరు తప్ప, ఆనాడైనా, ఈనాడైనా ప్రజలందరిచేత అలా ఉండేలా చేయగలిగిది మాత్రం రాజులే.
ఎందుకంటే బహుకొద్ది శాతం మంది ప్రజలు (షుమారుగా ఓ 3-5 శాతం) వారంతట వారుగా ధర్మబద్ధమైన జీవితం గడపగలిగేటంత మానసిక పరిపక్వత కలిగి ఉంటారు.
ఎక్కువమంది ప్రజలు ఒక కఠినమైన శాసనాన్నే అనుసరిస్తారు తప్ప, వారంతట వారుగా ధర్మబద్ధమైన జీవితం గడపగలిగేటంత మానసిక పరిపక్వత వారికి ఉండదు.
---------
ఇదే విషయాన్ని మహర్షి వాల్మీకి శ్రీమద్రామాయణంలో ఒకచోట మారీచుని ద్వారా చెపుతాడు.
సీతాపహరణకు తనకు సహాయపడమని మారీచుని రావణుడు కోరినపుడు, అతనిని హెచ్చరిస్తూ మారీచుడు ఇలా అంటాడు.
రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాం వర!|
తస్మాత్ సర్వాస్వవస్థాసు రక్షితవ్యా నరాధిపా:|| (అరణ్యకాండ 41వ సర్గ 10వ శ్లోకము)
"ఓ రావణా! ప్రజలయొక్క ధర్మాచరణముగాని, వారి శ్రేయస్సుగాని, రాజ ప్రవర్తననుబట్టియే యుండును. కావున ఎట్టి పరిస్థితులలోనైనను రాజులు ధర్మమార్గమున సుస్థిరులై యుండవలెను."
------------------
---------
ఇదే విషయాన్ని మహర్షి వాల్మీకి శ్రీమద్రామాయణంలో ఒకచోట మారీచుని ద్వారా చెపుతాడు.
సీతాపహరణకు తనకు సహాయపడమని మారీచుని రావణుడు కోరినపుడు, అతనిని హెచ్చరిస్తూ మారీచుడు ఇలా అంటాడు.
రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాం వర!|
తస్మాత్ సర్వాస్వవస్థాసు రక్షితవ్యా నరాధిపా:|| (అరణ్యకాండ 41వ సర్గ 10వ శ్లోకము)
"ఓ రావణా! ప్రజలయొక్క ధర్మాచరణముగాని, వారి శ్రేయస్సుగాని, రాజ ప్రవర్తననుబట్టియే యుండును. కావున ఎట్టి పరిస్థితులలోనైనను రాజులు ధర్మమార్గమున సుస్థిరులై యుండవలెను."
------------------
ఆనాడైనా, ఈనాడైనా కఠినమైన శాసనాన్ని చేసి, దానిని అంతే నిబద్ధతతో అమలుపరిచే వ్యవస్థను ఏర్పాటు చేసి, తాను స్వయంగా ఆ వ్యవస్థను అనుసరించే రాజుకు, ప్రజలలో ఆదరణ ఉంటుంది.
మనం ఈనాడు "సింగపూర్" పట్టణ శుభ్రత, అక్కడి ప్రజల చట్ట నిబద్ధత గురించి చెప్పుకుంటాము. అక్కడి ప్రజలందరు అంతటి మానసిక పరిపక్వత కలిగి ఉన్నారా అంటే అనుమానమే! అక్కడ అమలులో ఉన్న కఠినమైన శాసనాలు, వాటిని నిబద్ధతతో అమలుపరిచే వ్యవస్థను ఏర్పాటు చేసిన పాలకుల గొప్పతనమే అది.
శ్రీరాముడు కఠినమైన శాసనాన్ని చేసి, దానిని అంతే నిబద్ధతతో అమలుపరిచే వ్యవస్థను ఏర్పాటు చేసి,ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో తాను స్వయంగా ఆచరించి చూపాడు.
శ్రీరాముడినే ఎందుకు కవి ఎంచుకున్నాడంటే, ఆయనలా కాలినాడకతో అయోధ్య నుండి మిధిలా నగరం వరకు, గంగానది నుండి దక్షిణాన ఉన్న సముద్రం వరకు ప్రయాణించి ధర్మస్థాపన చేసిన రాజు మరెవ్వరు లేరు.
సర్వేజనా: సుఖినోభవంతు
No comments:
Post a Comment