చాల శక్తి ఉండి కూడా తన కన్నా బలహీనులను లేదా తనను ఆశ్రయించిన వారిని రక్షించడం అనే స్వభావాన్ని పరిశీలిస్తే శ్రీరాముని విషయాని కొస్తే వివరించి చెప్పనక్కరలేదు. బాలకాండ నుండి యుద్ధకాండ వరకు అంతట అజేయుడిగా నిలచాడు. పైగా ఇంద్రజిత్తును చంపవలసి వచ్చినపుడు లక్ష్మణుడు శ్రీరాముని ధర్మనిబద్ధతను, సత్యసంధతను, అజేయత్వాన్నే ఆధారం చేసుకున్నాడు.
తన కన్నా బలహీనులను లేదా తనను ఆశ్రయించిన ఋషులను, సుగ్రీవుడు, విభీషణులను ధర్మబుద్ధితో మాట ఇచ్చి కాపాడాడు.
ఆదర్శ భార్యభర్తలను గురించి చెప్పవలసి వస్తే శ్రీరాముడి కాలం నాటికే అతి వృద్ధులైన అత్రి అనసూయలున్నారు. అత్రి మహర్షి తపోశక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అనసూయ మాత కేవలం పతివ్రత ధర్మాన్ననుసరించి జీవించిన ఇల్లాలే కాదు,
10వేల సంవత్సరాలు గొప్ప తపస్సు చేసిన తపస్విని. అసూయను జయించింది కాబట్టి ఆమె అనసూయగా పేరు గాంచింది.
10వేల సంవత్సరాలు గొప్ప తపస్సు చేసిన తపస్విని. అసూయను జయించింది కాబట్టి ఆమె అనసూయగా పేరు గాంచింది.
ఒక సందర్భంలో 10 రాత్రులను ఒక రాత్రికి కుదించింది. ఒకసారి 10 సంవత్సరాలు తీవ్రమైన కరువు వస్తే, తన తపస్సక్తితో ఫలాలను, దుంపలను సృష్టించి ప్రజలకు అందించింది. జాహ్నవి నదిని అక్కడే ప్రవహించేటట్లు చేసింది.
ఆదర్శ భార్యభర్తలను గురించి చెప్పవలసి వస్తే సీతారాములనే ఎందుకు చెబుతారు? అత్రి అనసూయల గురించి ఎందుకు చెప్పరు?
----------------
శ్రీ సీతారాముల జీవన విధానం ప్రజల మధ్యన, ప్రజల కోసముండేది. మామూలు ప్రజలకు అందుబాటులో ఉండి, వారిలాగే సంసారము, పిల్లలు మధ్యలో ఉంటూ, ధనార్జన చేస్తూ, అన్ని సమస్యల మధ్యన కూడా ధర్మబద్ధమైన జీవనం సాగించిన శ్రీ సీతారాముల జీవన విధానం స్ఫూర్తిదాయకంగా, మార్గదర్శనం చేసే విధంగా ఉంటుంది.
----------------
ఇక్కడ లోక స్వభావాన్ని కొంచెం గుర్తుచేసుకోవాలి.
ఋషులు వారి జీవన గమ్యము, జీవించే విధానము మామూలు ప్రజల జీవన గమ్యము, జీవించే విధానములకంటే భిన్నంగా ఉంటుంది.
ఋషులు స్థూలంగా ధర్మబద్ధమైన జీవన విధానము గురించి చెప్పగలరుకాని, మామూలు ప్రజలకు నిత్యజీవితంలో ఎదురుపడే సందేహాలకు సమాధానమివ్వడానికి వారు అందుబాటులో ఉండరు.
కందమూలాలు, పళ్ళు తింటూ సర్వసంగపరిత్యాగులై ముక్తియే పరమగమ్యంగా ఉండే ఋషుల జీవితం మామూలు ప్రజలకు దూరం నుండి చూసి నమస్కరించే విధంగా ఉంటుందికానీ స్ఫూర్తిదాయకంగా ఉండదు, ఆచరణ సాధ్యం కాదు.
కాబట్టి వారికి అందుబాటులో ఉండి, వారిలాగే సంసారము, పిల్లలు మధ్యలో ఉంటూ, ధనార్జన చేస్తూ, అన్ని సమస్యల మధ్యన కూడా ధర్మబద్ధమైన జీవనం సాగించే వ్యక్తుల జీవించే విధానము వారికి స్ఫూర్తిదాయకంగా, మార్గదర్శనం చేసే విధంగా ఉంటుంది.
అందుకే శ్రీమద్రామాయణ కావ్య కర్త, అత్రి అనసూయల జీవితంకాని, వశిష్టుడు అరుంధతిల జీవితంకాని మరి వేరే ఋషుల జీవన విధానం ఎక్కువగా శ్రీమద్రామాయణంలో వివరించి చెప్పలేదు.
No comments:
Post a Comment