Sunday, 13 September 2015

బాలకాండ పాక్షికంగా ప్రక్షిప్తమా? (భాగం - 1)


నా చిన్నప్పుడు గ్రంథాలయాల్లో శ్రీమద్రామాయణం, మహాభారతం, పురాణాలు చదివినా,  శ్రీమద్రామాయణం మాత్రం కొంచెం లోతుగా చదివి, ఆలోచించడం, Facebookలో నా అభిప్రాయాలను ఉంచడం 2011లో ప్రారంభించాను.

ఆ సమయంలోనే అంతర్జాలం(Internet)లో శ్రీమద్రామాయణంలోని బాలకాండ, ఉత్తరకాండల గురించి ఈ విధంగా చదివాను.

-----------------------

While stabilizing the original text of Ramayana, historians surmised that portions of two Books [Kaandas], namely Book I, Bala Kaanda and Book VII, Uttara Ramayana  are later additions - "The first and the last Books of the Ramayana are later additions. The bulk, consisting of Books II--VI, represents Rama as an ideal hero. In Books I and VII, however Rama is made an avatara or incarnation of Vishnu, and the epic poem is transformed into a Vaishnava text. 

The reference to the Greeks, Parthians, and Sakas show that these Books cannot be earlier than the second century B.C......"[ The cultural Heritage of India, Vol. IV, The Religions, The Ramakrishna Mission, Institute of Culture ].

However, Book I, Balakanda is considered to be an original version except for some injected stories. 

Story starts from the fifth chapter of Book I, and tradition demands it to be read with the others. This stipulation is not obligatory to Uttara Kaanda, a later kaanda, wherein Sita's expulsion to forest takes place. 

Theologists worship Sri Rama as a God incarnate, philosophers make him the philosophical Absolute, while at the same time, materialists, condemning the above, appreciate the lyrical values of Ramayana, but as a great devotee-singer said "Whoever calls you in whatever way, you are that One". 

(Source:  http://valmikiramayan.net/)

---------------------------


1)     ఉత్తరకాండ గురించి పైన ఆంగ్లంలో వివరించిన విషయాలు నిజమవునా కాదా అనేది తేల్చుకోవడానికి నా అంతట నేనే ఉత్తరకాండ మొత్తం చదివాను.  

వాల్మికి మహర్షి శైలి, శ్రీమద్రామాయణంలోని మిగిలిన కాండలలో ఆయన చేసిన దేవతాస్థుతులు, మిగిలిన కాండలలోని సన్నివేశాలు, శ్రీమద్రామాయణం తరువాత వచ్చిన మహాభారతంలోని శ్రీరాముని కథ (శ్రీరామోపాఖ్యనం), మొదలైనవన్నీ కలిపి చదివినప్పుడు ఉత్తరకాండ  మొత్తం  ప్రక్షిప్తమేనని అర్థమయ్యింది.

2)        బాలకాండ విషయానికొచ్చేసరికి, క్రింద ఉటంకించిన కారణాల వల్ల ఈ కాండ మొత్తం ప్రక్షిప్తం కాదేమోననిపించింది.  

(i)    అయోధ్యకాండనుంచే శ్రీమద్రామాయణం మొదలౌతుందనుకుంటే, అందులో కథానాయకుడైన శ్రీరామ జననం గురించి లేదు.  కాబట్టి బాలకాండలోని  ఘట్టం ఉండాలి.

(ii)   అయోధ్యకాండలో వివాహమైన సీతారాములు సుఖసంతోషాలతో 12 సంవత్సరాలు గడిపినట్లుంది.  కాబట్టి బాలకాండలోని వారి వివాహఘట్టం ఉండాలి.

(iii)   అయోధ్యకాండ ప్రారంభసర్గలో, భరతుడు శత్రుఘ్నునితో కలసి తన మేనమామైన "యుధాజిత్తు" ఇంటికి వెళ్ళినట్లు ఉంది. బాలకాండలో "యుధాజిత్తు" మిథిలకు వచ్చినట్లు ఉంది కాబట్టి, బాలకాండలోని ఆ ఘట్టం ఉండాలి.

(iv)  తన ఇంటిలో ఉన్న వరుణ ధనస్సును చూడడానికి విశ్వామిత్రుడు శ్రీరామలక్ష్మణులతో వచ్చినట్లు, అయోధ్యకాండ చివరిలో తపస్విని అనసూయతో సీత చెబుతుంది.  కాబట్టి అయోధ్యనుండి శ్రీరామలక్ష్మణులు మిథిలికు ఎలా, ఎందుకు వచ్చారో అని చెప్పేఉన్న బాలకాండ ఘట్టాలుండాలి.
  

ఐతే బాలకాండలోని ఘట్టాలన్నీ  వాల్మీకి మహర్షి శైలితోను, ఆయన కీర్తించిన  వేదకాలపు దేవతారాధన పద్ధతులతోను పోలి ఉండకపోవడంవల్లను, ఆ ఘట్టాలు తొలగించి చదువుతేగానీ,  వాల్మీకి లోకానికి అందించిన శ్రీమద్రామాయణం మనకు అర్థం కాదు.


No comments:

Post a Comment