మహర్షి వ్యాసుడు మహాభారత కథను "జయం" అనే పేరుతో ప్రపంచానికి అందించినప్పటి సమయానికి, అందులో వేదకాలంనాటి దేవతలైన ఇంద్రుడు, వరుణుడు, అర్యముడు, బృహస్పతి, ఆదిశేషుడు మొదలైనవారి స్తుతియే ఉన్నది అనడానికి ఈ క్రింది విశ్లేషణ గమనించగలరు.
తైత్తరీయ ఉపనిషత్తులోని "శిక్షావల్లి"లోని మొదటి అనువాకంలోని 1వ శాంతి మంత్రంలో, వేదకాలంనాటి దేవతలైన వరుణుడు, అర్యముల ప్రస్తావన ఉంది.
ఓం శం నో మిత్ర: శం వరుణ: |
శం నో భవత్వర్యమా |
శం నో ఇంద్రో బృహస్పతి:|
శం నో విష్ణురురుక్రమ: | (తైత్తరీయ ఉపనిషత్తు శాంతి మంత్రం -1)
"ఓం! మిత్ర, వరుణుడు, (గౌరవనీయుడైన) అర్యముడు, ఇంద్రుడు, బృహస్పతి, వేగ గమనంగల విష్ణువు మమ్ము అనుగ్రహించుగాక!"
-----------------------
మహాభారతయుద్ధం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన శ్రీమద్భగవద్గీతలోని క్రింది శ్లోకములను గమనిస్తే, శ్రీమద్భగవద్గీతలో కూడా వేదకాలంనాటి దేవతల స్తుతియే కనబడుతుంది.
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం|
పితౄణామర్యమా చాసిం యమ: సమ్యమతామహం|| (శ్రీమద్భగవద్గీత, విభూతి యోగము 29వ శ్లోకము)
"నాగజాతివారిలో ఆదిశేషుడ (అనంతుడ)ను నేను. జలచరములకు అధిపతియైన వరుణుడను నేను. పితరులలో అర్యముడను (పితృగణ ప్రభువును) నేను. శాసకులలో యమధర్మరాజును నేను."
---------------------
మన తెలుగువాడైన కీ.శే. శ్రీ కోట వేంకటాచలం పరిశోధన ప్రకారం మహాభారతయుద్ధం క్రీ.పూ. 3139 వ సంవత్సరంలో జరిగినది. కలిశకం క్రీ.పూ. 3102 వ సంవత్సరంలో ప్రారంభమయ్యింది.
క్రీ.పూ. 3102వ సంవత్సరంలో కలియుగం ప్రారంభంనాటికి ఉన్న వేదకాలంనాటి దేవతల ఆరాధన, క్రీ.పూ.509వ సంవత్సరంలో జన్మించిన శ్రీ ఆదిశంకరుల కాలం నాటికి (2,600 సంవత్సరాల కాల పరిధిలో) తొలగిపోయి, విష్ణు, శివ, శక్తి, గణపతి ఆరాధన ఆధిపత్యంలోకి వచ్చింది. వేదకాలంనాటి దేవతలైన సూర్య, కార్తికేయుల ఆరాధన మాత్రం కొనసాగింది.
పితామహుడైన బ్రహ్మ, ఇంద్రుల స్థానం తగ్గిస్తూ విష్ణు, శివ, శక్తి ప్రాధాన్యంతో ఉన్న 18 పురాణాల రచన ఈ 2,600ల సంవత్సరాలకాలంలోనే జరిగి ఉండాలి.
No comments:
Post a Comment