ముందు వివరించినట్లు వేదకాలంలో యజ్ఞాలు చేయడం, అగ్నిద్వారా హవిస్సులు దేవతలకు ఇవ్వడం, విశ్వామిత్రుడులాంటి ఋషులు తపస్సు చేయడం, ప్రజలు ఋషులు బోధించిన ధర్మమార్గం అనుసరించడం తప్ప వేరేమి కనిపించవు.
ఐతే ఆనాటి రాజులు కానీ, ప్రజలుగానీ ఆనాటి దేవతలైన ఇంద్రుడు, వరుణుడు, వాయువు మొదలైన వారిలో ఏ ఒక్కరినో ఆశ్రయించి, ఆ దేవతనే కీర్తిస్తూ, మిగిలినవారిని కించపరుస్తూ మాత్రం జీవించలేదు.
అగస్త్యుడంతటి గొప్ప ఋషి కూడా, ఆనాటి దేవతలందరికీ పూజలు జరిపినట్లు శ్రీమద్రామాయణం చెబుతోంది.
శ్రీరాముడు సీతాలక్ష్మణసహితంగా అరణ్యంలో తిరుగుతు, అగస్త్యమహర్షి ఆశ్రమం చేరుకుని, అక్కడ జరిగే నిత్య దేవతారాధనల గురించి ఈ విధంగా గమనించినట్లు శ్రీమద్రామాయణంలో వర్ణింపబడినది.
స తత్ర బ్రహ్మణ: స్థానం అగ్నే: స్థానం తథైవ చ ||
విష్ణో: స్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వత: |
సోమ స్థానం భగ స్థానం స్థానం కౌబేరం ఏవ చ ||
ధాతుర్విధాతు: స్థానే చ వాయో: స్థానం తథైవ చ |
స్థానం చ పాశ హస్తస్య వారుణస్య మహాత్మన: ||
స్థానం తథైవ గాయత్ర్యా వసూనాం స్థానం ఏవ చ |
స్థానం చ నాగరాజస్య గరుడ స్థానం ఏవ చ ||
కార్తికేయస్య చ స్థానం ధర్మ స్థానం చ పశ్యతి | (అరణ్యకాండ 12వ సర్గ 17-21 శ్లోకములు)
"ఆ ఆశ్రమమునందు బ్రహ్మదేవుడు, అగ్ని, విష్ణువు, మహేంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, భగుడు, కుబేరుడు, ధాత, విధాత, వాయువు, పాశహస్తుడైన వర్షదేవుడు, గాయత్రి, వసువులు,నాగేంద్రుడు, గరుడుడు, కార్తికేయుడు దేవతలకు అర్చించడానికి స్థానములు కలవు."

No comments:
Post a Comment