Thursday, 3 September 2015

వేదకాలంనాటి ఆరాధన పద్ధతులకి, శైవం, వైష్ణవం వంటి మతాల ఆరాధన పద్ధతులకి తేడా (భాగం- 3)

పైపైన చూస్తే, శైవం, వైష్ణవం వంటి మతాల  ఆరాధన పద్ధతులలో ఉండే విగ్రహారాధన, ఆ దేవతల అవతారాల కథలు, భజనలు, ఆర్భాటంగా చేసే పూజలు, హోమాలు,మఠాధిపతులు,మఠాల స్థాపన, నిర్వహణ వంటివి ఉండడంలో తప్పేమిటనే ప్రశ్న ఉదయించవచ్చును.

సామాన్య స్థాయిలో ఉండే వ్యక్తులను భగవంతుడి వైపు మళ్ళించడంలో అవి ఉపయోగపడుతున్నాయి,   మనస్సు పరిపక్వత చెందిన తరువాత ఆ  వ్యక్తులే నిర్గుణ తత్వంతో భగవంతుడిని ఆరాధిస్తారు కదా! అనే ఆలోచన కలుగవచ్చును.

ఐతే పైకి కనిపించని విధంగా, అంత సులభంగా అర్థంకాని విధంగా సమాజాన్ని పీడిస్తున్న,  కొన్ని ప్రధాన సమస్యలకి మూలం ఈ శైవం, వైష్ణవం వంటి మతాల  ఆరాధన పద్ధతులలో ఉండే విగ్రహారాధన, ఆ దేవతల అవతారాల కథలలో ఉందంటే నమ్మడం కష్టమే!  కానీ ఇది నిజం!


పరాయి దేశాలనుంచి మనదేశానికి వచ్చిన ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలతోపాటు, శైవం, వైష్ణవం వంటి మతాలు ప్రధానంగా ప్రోత్సహించేది, వేదకాలంలో లేనటువంటి గుంపు మనస్తత్వం.


ఈ మనస్తత్వంతో ఉన్న ప్రజలు,

1)        ఆ గుంపులోకి ఎందరు క్రొత్తగా వస్తున్నారు? పాతవాళ్ళు వెళ్ళిపోవటంలేదుకద!  ఉన్నవాళ్ళు వెళ్ళకుండా ఉండడానికి ఏ రకమైన బాహ్యమైన వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి, తిలక/నామధారణ ఏ విధంగా చేయాలి, వీలయితే ప్రక్కగుంపు దేవతను/దేవుడిని (లేక) అందులోని ప్రజలను కించపరిచేవిధంగా ఏ రకమైన వ్యాఖ్యలు చేయాలి, ఇలాంటి ఆలోచనలతోనే గడిపేస్తుంటారు.

2)     మా దేవుడు/దేవత ఏ రకంగా మిగిలిన మతాల దేవుడు/దేవతలపై ఆధిపత్యం చేస్తున్నాడు/చేస్తున్నది, ఎన్ని అవతారాలు ఎత్తి, ప్రజలను, మిగిలిన మతాల దేవుడు/దేవతలను కాపాడడం జరిగింది అనే ఆలోచనలు కలిగి ఉంటారు.

ఈ ఆధిపత్యం చూపించుకునే ప్రయత్నంలోనే, కలియుగం ప్రారంభంవరకు (క్రీ.పూ.3100 సంవత్సరంవరకు) ఉన్న వేదకాలపు పద్ధతిలో దేవతలనందరిని పూజించే అలవాటు పోయి, ఒకే దేవుడిని కీర్తించడం, ఇంకో దేవుడిని కించపరచడం ప్రారంభమయి, సమాజంలో చాప క్రింద నీరులా ఈ అంతర్గత ద్వేషం (Cold war) వ్యాపించింది.

No comments:

Post a Comment