Sunday, 20 September 2015

అయోధ్య విడిచే సమయానికి సీత శ్రీరాముల వయస్సులెంత?



ప్రచారంలో ఉన్న కథల ప్రకారం సీత శ్రీరామునికన్నా వయస్సులో పెద్దది.  ఐతే శ్రీమద్రామాయణం ప్రకారం, శ్రీరాముడు సీతకన్నా వయస్సులో పెద్దవాడు.

సీత ఒంటరిగా ఉన్నప్పుడు రావణుడు ఆశ్రమానికి వచ్చి, సీత అందాన్ని పొగడి, ఆమె గురించి అడుగుతాడు.  తమ గురించి చెప్పేటప్పుడు,  అయోధ్య విడిచే సమయానికి తమ వయస్సుల గురించి ఇలా చెబుతుంది.

మమ భర్తా మహాతేజా వయసా పంచవింశక:|
అష్టాదశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే||       (అరణ్యకాండ 47వ సర్గ 10వ శ్లోకము)

"మిగుల పరాక్రమశాలియగు నాభర్తయొక్క అప్పటి వయస్సు 25 సంవత్సరములు.  నా వయస్సు 18 సంవత్సరములు."

No comments:

Post a Comment