శ్రీమద్రామాయణం ఏ కాలానికి సంబంధించినది? బహుశ: ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎవరికైనా కష్టమేనని చెప్పాలి.
శ్రీమద్రామాయణంనాటికి యుగవిభజన జరుగలేదు. కాలగర్భంలో ఎన్ని సంవత్సరాల క్రితం శ్రీమద్రామాయణం వ్రాయబడినదో, శ్రీరాముడు ఏనాటివాడో చెప్పడంకానీ, నిరూపించడంకానీ, ప్రస్తుతం దొఱుకుతున్న ఆధారాలప్రకారం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
వేదకాలానికి చివరిలో వచ్చినది శ్రీమద్రామాయణము. ఆ తరువాత చాలా కాలానికి మహాభారతము వ్రాయబడినది. మహాభారతము వ్రాసిన తరువాత వేదవ్యాసుడు 18 పురాణాలు వ్రాసినట్లు నానుడి. ఆ పురాణాలలోని వర్ణన ప్రకారం, నాటికి కృత,త్రేతా, ద్వాపర, కలి యుగాలుగా యుగవిభజన జరిగినట్లు మనకు అర్థమవుతుంది.
చాలాకాలం భారతదేశాన్ని పాలించిన ఆంగ్లేయుల కాలంలో మనదేశచరిత్ర వారి భావాలకనుగుణంగా వ్రాయబడి, వ్యాప్తిచేయబడడంతో అవే భావాలు భారతప్రజల మనస్సులలో నాటుకుపోయాయి. ఆంగ్లేయుల కాలంలో వ్రాయబడిన మనదేశచరిత్ర ప్రకారం శ్రీమద్రామాయణం క్రీ.పూ. 3వ శతాబ్ధంలో వ్రాయబడినది.
ఐతే శ్రీమద్రామాయణం, మహాభారతం చదివేటప్పుడు, మనకు దొఱికిన ఆధారాలను ఏదీ వదలక, అన్నీ కలుపుకుని చదివితే, మనకు వేరేరకమైన చిత్రం కనిపిస్తుంది.
1) ప్రక్షిప్తకాండైన "ఉత్తరకాండ"ను వదిలి, యుద్ధకాండవరకు చదివితే, శ్రీమద్రామాయణంలో యుద్ధకాండలో, సింహాసనం ఎక్కిన తరువాత శ్రీరాముడు 10,000 సంవత్సరాలు రాజ్యం చేసినట్లు ఉంది.
రాజ్యం దశసహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవ: |
శతాశ్వమేధానాజహ్రే సదశ్వాంభూరిదక్షిణాన్ || ( యుద్ధకాండ 128వ సర్గ 106వ శ్లోకం)
"ఆ రఘువరుడు పదివేల సంవత్సరములపాటు కోసలరాజ్యమును పరిపాలించెను. ఆ ప్రభువు మేలుజాతి అశ్వములను, పుష్కలముగా దక్షిణలను ఒసంగి వందలకొలది అశ్వమేధయాగములను ఆచరించెను."
2) మహాభారతములోని "వనపర్వం" 272-289 భాగాలలో, ధర్మరాజుకు మార్కండేయమహర్షి, శ్రీరామకథను చెప్పినట్లు ఉంది. అంటే మహాభారతమునాటికే శ్రీమద్రామాయణం ప్రాచుర్యంలో ఉందని అర్థం.
3) ఆంగ్లేయుల చరిత్రకారులవలెకాక, మనదేశచరిత్రకారులు స్వతంత్రంగా పరిశోధన చేసారు. వారిలో ఒకరు మన తెలుగువాడైన కీ.శే. శ్రీ కోట వేంకటాచలం. ఆయన పరిశోధన ప్రకారం మహాభారతయుద్ధం క్రీ.పూ. 3139 వ సంవత్సరంలో జరిగినది. కలిశకం క్రీ.పూ. 3102 వ సంవత్సరంలో ప్రారంభమయ్యింది.
4) ధర్మరాజుకు మార్కండేయమహర్షి, శ్రీరామకథను చెప్పినది మహాభారతయుద్ధానికి ముందే కాబట్టి, క్రీ.పూ. 3139 వ సంవత్సరానికి ముందే అనుకోవాలి.
5) శ్రీరాముడు 10,000 సంవత్సరాలు రాజ్యం చేసిన వెంటనే, మహాభారతం జరిగినది అనుకున్నా, క్రీ.పూ. 3139వ సంవత్సరానికి 10,000 సంవత్సరాలు ముందే శ్రీమద్రామాయణం వ్రాయబడినది అనుకోవాలి. అంటే, కనీసం క్రీ.పూ. 13,139 వ సంవత్సరానికి ముందే శ్రీరాముడు ఉండి ఉండాలి.

No comments:
Post a Comment