Thursday, 3 September 2015

శ్రీమద్రామాయణం కాలం కనీసం 16 లక్షల సంవత్సరాలు?


శ్రీమద్రామాయణం జరిగి కొన్ని లక్షల సంవత్సరాలైందని అనేకమంది స్వదేశి పరిశోధకులు అంటుంటారు.  ఐతే దీనికి ప్రత్యక్ష ఆధారమేమి లేకపోయినా, శ్రీమద్రామాయణంలో వివరించిన ఆనాటి భౌగోళిక పరిస్థితులనుబట్టి, అందులో ఇచ్చిన వర్ణనలనుబట్టి ఈ విషయాన్ని నమ్మవచ్చును.

----------------------------

శ్రీహనుమ రావణుని లంకలో ప్రవేశించి అన్ని చోట్ల వెతుకుతు, రావణుని విశాల భవనాన్ని చూస్తాడు.  అక్కడ నిలచియున్న రథాలను, గుఱ్ఱాలను, ఏనుగులను, సైనికులను మహర్షి వాల్మీకి ఇలా వర్ణిస్తాడు.

రథై: యానై: విమానై: చ తథా గజ హయై: శుభై: |
వారణై: చ చతు: దంతై: శ్వేత అభ్ర నిచయ ఉపమై: ||   (సుందరకాండ 4వ సర్గ 27వ శ్లోకము)

చక్కని గుఱ్ఱాలతోను, ఏనుగులతోను, తెల్లని మేఘకులవలెనున్న నాలుగు (4) దంతములుగల భద్రగజములతోను అలరారు చుండెను.








ఉత్తమం రాక్షసావాసం హనుమానవలోకయన్ |
ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్రనివేశనం ||  (సుందరకాండ 9వ సర్గ 4వ శ్లోకము)

"ఆ హనుమంతుడు రాక్షసుల నిలయములను పరికించుచు సర్వోత్తమమైన ఆ రావణుని ప్రాసాదమును జేరెను."

చతుర్ విషాణైర్ ద్విరదై: త్రివిషాణై: తథైవ చ |
పరిక్షిప్తం అసంబాధం రక్ష్యమాణం ఉదాయుధై: ||   (సుందరకాండ 9వ సర్గ 5వ శ్లోకము)

"విశాలమైన ఆ భవనము రెండేసి, మూడేసి, నాల్గేసి దంతములుగల మత్తగజములచేతను, ఆయధములను చేతబట్టి సర్వసన్నద్ధులైయున్న రాక్షసులచేతను పరివేష్టింపబడి వారిచే అది సురక్షితముగా ఉండెను."

ఇక్కడ మహర్షి 4,3,2 దంతాలుగల ఏనుగులు రావణుని విశాల భవనాన్ని రక్షిస్తున్నట్లు వర్ణిస్తున్నాడు.  4 దంతాలుగల ఏనుగులు 120 నుంచి 16 లక్షల సంవత్సరాల క్రితం భూమిమీద సంచరించినట్లు ఆధునిక పరిశోధకులు చెబుతున్నారు.
----------------------
The Gomphotheriidae were a diverse taxonomic family of extinct elephant-like animals (proboscideans). Referred to as gomphotheres, they were widespread in North America during the Miocene and Pliocene epochs, 12–1.6 million years ago. Some lived in parts of Eurasia, Beringia and, following the Great American Interchange, South America. 


Gomphotheres differed from elephants in their tooth structure, particularly the chewing surfaces on themolar teeth. Most had four tusks, and their retracted facial and nasal bones prompt paleontologists to believe that gomphotheres had elephant-like trunks. 



-----------------------

మహర్షి వాల్మీకి వర్ణనలనుబట్టి శ్రీమద్రామాయణం జరిగిన నాటికి 4 దంతాల ఏనుగులే కాకుండా 3,2 దంతాలుగల ఏనుగులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

కాబట్టి ఈ వర్ణన ప్రకారం శ్రీమద్రామాయణం జరిగి కనీసం 16 లక్షల సంవత్సరాలైందని గ్రహించవచ్చును.

No comments:

Post a Comment