Tuesday, 30 December 2025

వశిష్ఠుడు ఎలా జన్మించారు?




విష్ణు ప్రధానమైన భాగవతం 6వ స్కందములోని ఒక కథలో, మిత్రుడు మరియు వరుణుడు ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు, వారు ఊర్వశిని చూసి లైంగికంగా ప్రేరేపించబడ్డారు. వారు తమ వీర్యాన్ని ఒక కుండలోకి స్కలిస్తారు , తర్వాత వశిష్ఠుడు, అగస్త్యుడు దాని నుండి జన్మిస్తారు.


అగస్త్యశ్చ వసిష్ఠశ్చ మిత్రావరుణయోరృషీ ।  

రేతః సిషిచతుః కుమ్భే ఉర్వశ్యాః సన్నిధౌ ద్రుతమ్ ॥ 6.18.6  

---

పురాణాలకు ఆధారమైన ఋగ్వేదంలో, సాధనలో (యజ్ఞం) మిత్ర మరియు వరుణులు,  మనస్సులో వారి తేజస్సును నింపితే, వసిష్ఠఋషి జన్మించారని ఋగ్వేదం చెబుతోంది. అంటే, ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందినట్లు అర్థం చేసుకోవాలి.


సత్రే హ జాతావిషితా నమోభిః కుమ్భే రేతః సిషిచతుః సమానమ్ । 

తతో హ మాన ఉదియాయ మధ్యాత్తతో జాతమృషిమాహుర్వసిష్ఠమ్ ॥ ఋగ్వేదం 7.33.13 

అర్థం:

రెండు [మిత్ర మరియు వరుణ], ఒక యజ్ఞ సమయంలో, గౌరవంతో ఆరాధించగా, వారి తేజస్సును  మనస్సులో నింపారు. దాని మధ్య నుండి మాన  ఉద్భవించింది. దాని నుండి వారు వసిష్ఠఋషి జన్మించారని  చెబుతారు. 

---

ఇక్కడ రేతస్సు అంటే వీర్యం అనే సామాన్య అర్థం కాకుండా, ఋగ్వేద కాలమునాటి తేజస్సు అనే అర్థం తీసుకోవాలి.   

---

వసిష్ఠఋషి ఉర్వశి మనస్సు నుండి జన్మించిన జ్ఞాని, అని ఋగ్వేదం చెబుతోంది.  ఉర్వశి అంటే, పురాణాలలో వర్ణించినట్లు దేవ వేశ్య కాదు. ఋగ్వేదంలో ఉర్వశీ అంటే దేవీ సరస్వతీ యొక్క పర్యాయ పదం. 

ఉతాసి మైత్రావరుణో వసిష్ఠోర్వశ్యా బ్రహ్మన్మనసోఽధి జాతః । 

ద్రప్సం స్కన్నం బ్రహ్మణా దైవ్యేన విశ్వే దేవాః పుష్కరే త్వాదదన్త ॥ ఋగ్వేదం 7.33.11 

అర్థం: 


ఓ వసిష్ఠ! మీరు మిత్ర మరియు వరుణ వంశస్థులు, ఉర్వశి మనస్సు నుండి జన్మించిన జ్ఞాని మీరు, సాధనతో ఒక చుక్క (సోమం) ఉద్భవించింది.  దేవతలందరూ మిమ్మల్ని అంతరిక్షంలో తీసుకెళ్లారు. 

---- 

ఉర్వశి మనస్సు నుండి జన్మించిన జ్ఞాని మీరు - వసిష్ఠోర్వశ్యా బ్రహ్మన్మనసోఽధి జాతః

No comments:

Post a Comment