Friday, 28 August 2015

శ్రీమద్రామాయణం ఎవరి కోసం? (భాగం – 1)

శీర్షికను చూడగానే చాలా మందికి నవ్వు రావచ్చునుకొందరికి ఆశ్చర్యం కలుగవచ్చును. 

అంతగా చదువుకోని వ్యక్తులు కూడా వెంటనే చెప్పే సమాధానంశ్రీమద్రామాయణం మానవజాతి కోసంఅని. 
ఒక ఆదర్శ ప్రభువు ఎలా ఉండాలిఒక మంచి కుమారుడు ఎలా ఉండాలిఒక మంచి తమ్ముడు ఎలాఉండాలిఒక ఆదర్శ భర్త ఎలా ఉండాలిఒక ఆదర్శ భార్య ఎలా ఉండాలిఒక ఆదర్శ సేవకుడు/మంత్రిఎలా ఉండాలిఇలా చాలా చెప్పవచ్చును.

 ప్రశ్నను నాలో నేను వేసుకుని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను.

సీత తండ్రి జనక మహారాజు ఒక మంచి కుమారుడుఆదర్శ ప్రభువే కద! మంచి తమ్ముడుగా జనక మహారాజు తమ్ముడు కుశధ్వజుడున్నాడు.

ఆదర్శ భార్యభర్తలను గురించి చెప్పవలసి వస్తే శ్రీరాముడి కాలం నాటికే అతి వృద్ధులైన అత్రిఅనసూయలున్నారు కద! 

ఇలా చాలా మంది శ్రీమద్రామాయణంలోనే ధర్మబద్ధులైన వారున్నారుశ్రీరాముడి కధనే ఆధారంచేసుకుని కవి చెప్పదలుచుకున్నదేమిటి?

---- ---

నాకన్నా పెద్దవారునాకు తటస్థపడినవారుఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవారు చెప్పినదానినిబట్టి,శ్రీమద్రామాయణం ప్రజలనుతద్వారా సమాజాన్ని ధర్మబద్దమైన రీతిలో నడిచేటట్లు చేయడానికి కవివాల్మీకి రచించాడని నేను అర్ధం చేసుకున్నాను.

ఐతే కేవలం ధర్మబద్దమైన రీతిలో జీవించడమొకటే మనిషిని ముక్తుడిగా చేస్తుందా అంటేఅనుమానమేఎందుకంటే చాల కాలం ధర్మబద్దమైన రీతిలో జీవించినవారు కూడాముఖ్యంగాక్షత్రియులు అహంకారం వల్లనోఆశించకూడని వాటిని ఆశించడం వల్లనోమరికొన్ని కారణాల వల్లనో,తరువాతి కాలంలో పతనమైన ఉదాహరణలు శ్రీమద్రామాయణంలోనే కనిపిస్తాయి.

ఇక్ష్వాకు వంశములో పురుకుత్సునికి సత్యవ్రతుడను పుత్రుడును కలిగారువీరిలో సత్యవ్రతుడుపరాక్రమవంతుడై రాజ్యాధికారము చేపట్టెను సత్యవ్రతుడే తండ్రిమాట పాటించక మాదిగవాడదాటివచ్చుటగోవధజేయుటగోమాంసమును భక్షించుట యను మూడు పాపములు సలిపిత్రిశంకుడు అని నామధేయము గలిగివశిష్ట మహర్షిచేత శాపగ్రస్తుడౌతాడు.

శ్రీమద్రామాయణం ప్రకారం త్రిశంకు మహారాజు సత్యవాదిజితేంద్రియుడు.   

ఇతనికి గొప్ప యజ్ఞములను చేసి ప్రభావంతో దేవతలకు నివాస భూమియైన స్వర్గమునకుసశరీరముగా వెళ్ళవలెను - అని బుద్ధి పుట్టినదిఅతని గురువైన వశిష్టుడు అది అసాధ్యము అనివచించెను.

శ్రీగీతా ప్రెస్ వారి వ్యాఖ్యానం ప్రకారం గురువైన వశిష్టుడికి  సామర్ధ్యము లేదని కాదు విధంగాస్వర్గమునకు వెళ్ళినవారు లేరనికాదుత్రిశంకువుకు అట్టి అర్హత లేదని అర్ధం.


గురువైన వశిష్టుడి మాట వినకపోవడం వల్ల చివరికి అటు ఇటు గాని ఆకాశంలో ఒంటరిగాతల్లక్రిందులుగా వ్రేలాడుతు ఉండి పోయాడు.

No comments:

Post a Comment