Friday, 28 August 2015

శ్రీమద్రామాయణం ఎవరి కోసం?(భాగం - 2)

ధర్మబద్ధమైన జీవితమొకటే ఒక వ్యక్తిని ముక్తుడుగా చేయదని నా అభిప్రాయం. 

ఒక వ్యక్తి త్రికరణశుద్ధిగా ధర్మబద్ధమైన జీవితం సాగిస్తున్నాడా లేక అతనిలో నిద్రాణంగా కొన్నిబలహీనతలు ఉన్నాయా అనేది చూడాలంటే  వ్యక్తి వేరు వేరు సందర్భాలలో ముఖ్యంగా కష్టాలలో,ఎవరు కూడా గమనించలేని పరిస్థితులలో,లేదా చాల శక్తి ఉండి కూడా ఎవరికి అపకారం చేయకుండాఉండి త్రికరణశుద్ధిగా ధర్మబద్ధమైన జీవితం సాగిస్తున్నాడా అనేది తెలియాలి!

ఎందుకంటే అందరు గమనిస్తున్నప్పుడు లేదా పరిస్థితులు మామూలుగా ఉన్నప్పుడు ధర్మబద్ధమైనజీవితం సాగించడమనేది చాలా మంది చేయవచ్చును.

గాధి రాజు కుమారుడైన విశ్వామిత్రుడు వశిష్ట మహర్షిని కలిసి ఆతిధ్యం స్వీకరించేవరకు ఒక మంచిరాజుగా శ్రీమద్రామాయణం చెబుతుంది.

వశిష్ట మహర్షిని కలిసిన తరువాతవిశ్వామిత్రుడు ఆయననుఆశ్రమవాసులకు ఎటువంటిఇబ్బందులు కలుగుటలేదు కద అని అడిగి తెలుసుకుంటాడు. 

విశ్వామిత్రుడికిఆయన పరివారానికి వశిష్ట మహర్షి ఆయన ఆశ్రమంలో ఉన్నశబల(కామధేనువు)అనే ఆవు ద్వారా గొప్ప ఆతిధ్యం ఇస్తాడు.

అద్భుతశక్తుల కల  శబల(కామధేనువు)అనే ఆవును తన స్వంతం చేసుకోవాలనే కాంక్షఅతనిలోనిద్రాణంగా ఉన్న ఒక పశువుని నిద్ర లేపుతుంది.
----------

ముందుగా అనుకున్న జనక మహారాజు చరిత్ర గమనిద్దాము.

సిద్ధాశ్రమంలో రావణుని సహాయకులైన మారీచుడుసుబాహువు మొదలైన రాక్షసుల పీడ నుండి,బ్రహ్మర్షి విశ్వామిత్రుని యజ్ఞం సజావుగా సాగడానికి సహాయపడిన తరువాతబ్రహ్మర్షి విశ్వామిత్రునిసూచన మేరకుశ్రీరాముడు లక్ష్మణునితో కలసి మిధిలకు చేరినప్పటి నుండిసీతతో  శ్రీరామునివివాహం జరిగేంత వరకు మాత్రమేజనక మహారాజు మనకు కనిపిస్తాడు.

శ్రీమద్రామాయణములో జనక మహారాజును వర్ణించిన కొన్ని సర్గల ద్వారా మనకు తెలిసే విషయాలుఇవి:

ఆయన ధర్మబద్ధుడైన ఒక రాజు.  రాజధర్మాన్ని అనుసరించి తండ్రియైన హ్రస్వరోముని నుండివారసత్వంగా వచ్చిన  మిధిలను రాజ్యం చేస్తున్న  రాజురాజ్యకాంక్షతో వేరే రాజ్యంపై దండెత్తే రాజుకాదు.

తమ్ముడైన కుశధ్వజుని ప్రేమగా చూసుకుంటు ఉన్న అన్నకుశధ్వజుడు కూడా అన్న పట్లవినయవిధేయతలతో మెలగేవాడు.

ఆయనకు ఒక యాగ సందర్భంగా భూమిని దున్నుతుండగా దొఱికిన సీతయవ్వనవతియైనతరువాత  ఆమె కోసం వచ్చిన రాజులందరు శివ ధనుస్సును ఎత్తలేకమిధిలపైకి దండెత్తి వస్తే,తపస్సు చేసి దేవతలను ప్రసన్నం చేసుకునివారి సహాయంతో  రాజులందరిని తరిమి వేసాడు.

పై కారణంగానే దండెత్తి వచ్చిన సాంకాశ్యపుర రాజైన సుధన్వుడనే రాజుతో జరిగినయుద్ధంలో,సుధన్వుడు మరణిస్తాడువిజేతైన  జనక మహారాజుకే రాజ్యం దక్కినా రాజ్యం కూడాతనకే కావాలని అనుకోకతన తమ్ముడైన కుశధ్వజుని సాంకాశ్యపురానికి రాజుని చేస్తాడు.

ధర్మబద్ధులైన  అన్నదమ్ములు ఆదర్శమూర్తులే కద!

ఇంకెందు కోసం కవి వాల్మీకి శ్రీరాముడి కధనే ఆధారం చేసుకుని చెప్పదలుచుకున్నాడు?

No comments:

Post a Comment