Thursday, 17 September 2015

శ్రీమద్రామాయణంలో ఇంద్రుడి వర్ణన


శ్రీసీతారామలక్ష్మణులు దండకారణ్యంలో శరభంగ మహర్షి ఆశ్రమానికి చేరినపుడు, వారికి ఆ మహర్షి సమీపంలో ఒక అద్భుత పురుషుని చూస్తారు.


విభ్రాజమానం వపుషా సూర్య వైశ్వానరోపం |
అవరుహ్య రథోత్సంగాత్ ఆకాశే విబుధ అనుగం ||
అసంస్పృశంతం వసుధాం దదర్శ విబుధ ఈశ్వరం |
సంప్రభ ఆభరణం దేవం విరజో అంబర ధారిణం ||
తద్విధైరేవ బహుభి: పూజ్యమానం మహాత్మభి: |    |  (అరణ్యకాండ 5వ సర్గ 4-6 శ్లోకములు)


"ఆ మహాపురుషుడు సూర్యభగవానునివలెను, అగ్నిదేవునిరీతిగను దివ్యతేజస్సుతో వెలుగొందుచుండెను. అతడు రథమునుండి దిగి, భూమిని తకకుండ సాగిపోవుచుండెను.  అతనిని దేవతలు అనుసరించుచుండిరి.  ఆ మహాపురుషుడు దేవేశుడైన (విబుధ ఈశ్వరం) ఇంద్రుడేనని శ్రీరాముడు గ్రహించెను."



"తళతళ మెఱయుచున్న ఆభరణములతో ఆ ఇంద్రుడు దేదీప్యమానుడై వెలుగొందుచుండెను.  అతడు నిర్మలమైన వస్త్రములను ధరించియుండెను.  ఆయనవలె దివ్యతేజస్సులుగల పెక్కుమంది మహాత్ములు ఆయనను పూజించుచుండిరి."



హరితై: వాజిభిర్యుక్తం అంతరిక్ష గతం రథం ||
దదర్శ అదూరత: తస్య తరుణ ఆదిత్య సన్నిభం |
పాండుర అభ్ర ఘన ప్రఖ్యం చంద్ర మండల సన్నిభం ||
అపశ్యత్ విమలం ఛత్రం చిత్ర మాల్య ఉపశోభితం |    (అరణ్యకాండ 5వ సర్గ 7 - 8  శ్లోకములు)


"ఆ ఇంద్రుని రథము ఆకుపచ్చని గుఱ్ఱములు గలిగి, అంతరిక్షమున ఉదయభానునివలె ప్రకాశించుచుండెను.  శ్రీరాముడు ఆ రథమును సమీపముననుండియే చూచెను.  ఆ సురపతి చత్రము తెల్లని మేఘకాంతులతోడను, చంద్రమండలమువలె గుండ్రముగను తేజరిల్లుచు, చిత్రములైన మాలలతో అలంకృతమై స్వచ్చముగా శోభిల్లుచుండెను."

చామరవ్యజనే చ అగ్ర్యే రుక్మ దండే మహాధనే ||
గృహీతే వర నారీభ్యాం ధూయమానే చ మూర్ధని |

గంధర్వ అమర సిద్ధాశ్చ బహవ: పరమర్షయ: ||
అంతరిక్ష గతం దేవం వాగ్భిరగ్ర్యాభిరీడిరే |     (అరణ్యకాండ 5వ సర్గ  9 - 10  శ్లోకములు)


"ఇద్దరు దివ్యాంగనలు బంగారు దండములుగల అమూల్యములైన వింజామరలను పట్టుకొని ఇంద్రునకు ముందుభాగమున ఇరువైపులనుండి ఆయనను సేవించుచుండిరి.  గంధర్వులు, దేవతలు, సిద్ధులు, పెక్కుమంది మహర్షులు అంతరిక్షముననున్న ఇంద్రుని చక్కని స్తుతులతో కీర్తించుచుండిరి."

సహ సంభాషమాణే తు శరభంగేన వాసవే ||
దృష్ట్వా శత క్రతుం తత్ర రామో లక్ష్మణం అబ్రవీత్ |

రామోऽథ రథం ఉద్దిశ్య లక్ష్మణాయ ప్రదర్శయన్ ||

అర్చిష్మంతం శ్రియా జుష్టం అద్భుతం పశ్య లక్ష్మణ |
ప్రతపంతం ఇవ ఆదిత్యం అంతరిక్ష గతం రథం ||       (అరణ్యకాండ 5వ సర్గ  11 - 13  శ్లోకములు)


ఇంద్రుడు శరభంగమహర్షితో మాట్లాడుచుండగా జూచి, శ్రీరాముడు ఆ ఇంద్రుని రథమును లక్ష్మణునకు జూపుచు అతనితో ఇట్లనెను.


"ఓ లక్ష్మణా! ఆకాశముననున్న ఆ అద్భుత రథమును పరికింపుము.  దానినుండి కాంతిపుంజములు వెలువడుచున్నవి.  అవి ఒక తేజోరాశియై, సూర్యమడలమువలె వెలుగులను విరజిమ్మచున్నవి."

యే హయా: పురు హూతస్య పురా శక్రస్య న: శ్రుతా:|
అంతరిక్ష గతా దివ్యా: త ఇమే హరయో ధ్రువం ||    (అరణ్యకాండ 5వ సర్గ  14  శ్లోకము)


"పెక్కు యజ్ఞములకు ముఖ్య ఆహుతుడగు ఇంద్రుని యొక్క ఉత్తమాశ్వములనుగూర్చి ఇదివఱలో మనము వినియున్నాము.  ఇప్పుడు అంతరిక్షమున కనబడుచున్న హరిత వర్ణములు ఈ దివ్యాశ్వములవియే!  ఇది నిజము!"

-----------

ఇక్కడ 5వ శ్లోకంలో "విబుధ ఈశ్వరం" అనే పదాలని, 14వ శ్లోకంలోని "పురు హూతస్య శక్ర:" అనే పదాలని జాగ్రత్తగా గమనించాలి.

"విబుధ ఈశ్వరం" అంటే "దేవతలకు ఈశ్వరుడు" అని అర్థం.  "పురు హూతస్య శక్ర:" అంటే "ముఖ్య ఆహుతుడగు ఇంద్రుడు" అని అర్థం.

5వ శ్లోకం, 14వ శ్లోకం కలిపి చూస్తే మనకు అర్థమయ్యే విషయమేమిటంటే,

"ఇంద్రుడు దేవతలకు ఈశ్వరుడు.  దేవశం అని అన్నా ఇదే అర్థమొస్తుంది.  బాలకాండలో మన్మథుని నశింపచేసినది "దేవేశం" అని ఉన్నది. కాబట్టి మన్మథుని నశింపచేసినది ఇంద్రుడే!"

"అన్ని  యజ్ఞములకు ముఖ్య ఆహుతుడు (ఆహ్వానితుడు) ఇంద్రుడు మాత్రమే!  విష్ణువుకానీ శివుడుకానీ కాదు!"


No comments:

Post a Comment