క్రింద వ్రాసినవి స్వర్గీయ శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారి "షోడశి - రామాయణ రహస్యములు" అనే పుస్తకములోనివి (పేజి 50).
తతో రావణనీతాయ: సీతాయా: శత్రుకర్శన: |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి || (సుందరకాండ 1వ సర్గ 1వ శ్లోకం)
"అనంతరము శత్రువులను కృశింపచేసినవాడు(హనుమంతుడు) రావణాపహృతయైన సీతయొక్కజాడను అన్వేషించుటకై, చారణులు సంచరించు మార్గమున వెళ్ళుటకు నిర్ణయించుకొనెను."
ఈ శ్లోకమున హనుమ పేరే లేదు. దానికి బదులు శత్రుకర్శన: అనబడినది. శత్రుకర్శన: అనగా శత్రువులను కృశింపజేయువాడు అని అర్థము (కథలో రామాయణమున ఇంతవరకు హనుమచేత కృశింపజేయబడిన శత్రువులెవ్వరును లేరు).
శ్రుతులందుకొన్ని ప్రసిద్ధములగు ఉపమానములున్నవి. జీవునకు రథి అని, ఇంద్రియములకు హయములని, సంసారమునకు వృక్షమని-ఇత్యాది. అట్లే కామక్రోధాదులను అరిషడ్వర్గమని చెప్పుట ప్రసిద్ధము. హనుమ శత్రుకర్శనుడు అనగా జితేంద్రియుడు, లేక యమి, వశి అని అర్థము.
No comments:
Post a Comment