శ్రీరాముడు వానరసైన్యంతో కలసి లంకకు చేరి, యుద్ధం ప్రారంభిస్తాడు. శ్రీరాముని పరాక్రమానికి రావణుడుగానీ, రాక్షస సైన్యంగానీ తట్టుకోలేక పరాభవం పొందారు.
అప్పుడు రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు తనకున్న మాయాశక్తుల సహాయంతో, రధంతోసహా అదృశ్యమై, వానరసైన్యంపై శస్త్ర,అస్త్రప్రయోగం చేస్తాడు.
అంతటితో ఆగక, వానరసైన్యంపై బ్రహ్మాస్త్రప్రయోగం చేస్తాడు. అమోఘమైన ఆ శస్త్ర ప్రయోగంవల్ల 67 కోట్ల మంది వానరులు మరణిస్తారు. ఆనాడు శ్రీహనుమంతుడు హిమాలయాలనుండి సంజీవనీ పర్వతం తెచ్చి, మిగిలిన వానరులకు, శ్రీరామ లక్ష్మణులకు స్వాంతన కలిగిస్తాడు.
ఇంద్రజిత్తుకు వైరం శ్రీరామ లక్ష్మణులాపైననే. ఐతే అతను తన ఆగ్రహం వానర సైన్యంపై బ్రహ్మాస్త్ర ప్రయోగంతో తీర్చుకున్నాడు.
ఆ తరువాత ఇంద్రజిత్తు మఱల మాయా యుద్ధం ప్రారంభిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు ఆగ్రహంతో బ్రహ్మాస్త్రప్రయోగం చేసి, ఇంద్రజిత్తుని, ప్రపంచంలోని రాక్షసులనందరిని అంతం చేస్తానని అంటాడు.
అప్పుడు శ్రీరాముడు ఒక్క రాక్షసునిపై కోపంతో, రాక్షసులనందరినీ, నాశనం చేయాలని సంకల్పించడం తగదని వారిస్తాడు.
అదే శ్రీరాముని గొప్పతనం.
No comments:
Post a Comment