మనకున్న అపారసంపదలైన వేదాలు, ఉపనిషత్తులు, శ్రీమద్రామాయణ, మహాభారత ఇతిహాసాలు, భగవద్గీత, పురాణాలు ఎంతమంది చదువగలుగుతున్నారు, అర్ధం చేసుకోగలుగుతున్నారు?
వేదాలు ఎవరు వ్రాసారో తెలియదు, వాటిని చదివిగానీ, వినిగానీ అర్ధం చేసుకోవడం పండితులకే సాధ్యం కావడంలేదు.
భగవద్గీతను చాలా మంది (నేను కూడా) కొని ఇంట్లో పెట్టుకుంటారు. అందులోని శ్లోకాలను కంఠస్థం చేసినవారు చాలామంది ఉన్నారు. ఐతే దాని సారం అంత సులభంగా అర్ధంకాదు. దానిని ఉపదేశించిన శ్రీకృష్ణుడి యోగస్థాయిలో ఉన్న శ్రీశిరిడి సాయిబాబ, శ్రీరమణమహర్షి వంటి కొద్దిమంది యోగులకు మాత్రమే భగవద్గీత అర్ధమవుతుంది.
పురాణాలను చదువుతూంటే ఒక పురాణానికి ఇంకొకదానికి ఒకే విషయంలో అనేక బేధాలున్నాయి.
భగవంతుడు నాకు ప్రసాదించిన కొద్దిపాటి జ్ఞానంతో ఆలోచించి చూసాను. నాకు అర్ధమైన విషయమేమంటే, నాలాంటి పరిమిత జ్ఞానమున్న వ్యక్తులకు "శ్రీమద్రామాయణము" గ్రంథము, ఆదర్శంగా సీతారాములు చాలనిపించింది. మిగిలిన గ్రంథాలు, దేవుళ్ళను ప్రక్కనపెట్టినా ప్రశాంతంగా బ్రతుకవచ్చుననిపించింది.
శ్రీమద్రామాయణములో లేనిదేముంది. మహాభారత, భగవద్గీత,పురాణాలు అన్నింటిలో చెప్పిన ధర్మాలు, ధర్మసూక్ష్మాలు శ్రీమద్రామాయణములో ఉన్నాయి. ధర్మాలు, ధర్మసూక్ష్మాలను ఆచరించి చూపిన సీతారాములున్నారు. శ్రీకృష్ణుడి స్థాయిలో ఉన్న జ్ఞాని శ్రీహనుమ ఉండనే ఉన్నాడు. చాలదా?
శ్రీసీతారాములకు నమస్కారము.
No comments:
Post a Comment