సనాతనధర్మం ప్రకారం ముహూర్తానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శుభాన్ని, విజయాన్ని ఆశిస్తూ చేసే పనులు ముహూర్తం చూసుకొని చేయమని పెద్దలు చెబుతారు.
శ్రీమద్రామాయణంలో కూడా ముహూర్తంయొక్క ప్రాముఖ్యత గురించి ఉంది.
---------
రావణుడు సీతను అపహరించుకొనిపోయిన తరువాత, ఆమెను వెతుకుతున్న శ్రీరామలక్ష్మణులకు కొస ఊపిరితో ఉన్న జటాయువు కనిపిస్తాడు. సీత కోసం దుఖిస్తున్న శ్రీరాముని ఓదారుస్తూ, జటాయువు ఇలా అంటాడు.
యేన యాతో ముహూర్తేన సీతాం ఆదాయ రావణ:|
విప్రణష్టం ధనం క్షిప్రం తత్స్వామీ ప్రతిపద్యతే| (అరణ్యకాండ 68వ సర్గ 12వ శ్లోకము)
"రావణుడు సీతను అపహరించుకొనిపోయిన ముహూర్తమును బట్టి, నీకు కనబడకుండపోయిన సీతారూప ధనము యజమానివైన నీకు మఱల త్వరలోనే లభించును. ఇది నిశ్చయము."
విందో నామ ముహూర్తోऽయం స చ కాకుత్‌స్థ నాऽబుధత్|
త్వత్ప్రియాం జానకీం హృత్వా రావణో రాక్షసేశ్వర:|
ఝషవద్బడిశం గృహ్య క్షిప్రమేవ వినశ్యతి| (అరణ్యకాండ 68వ సర్గ 13వ శ్లోకము)
"ఓ కాకుత్‌స్థా! రాక్షసరాజైన రావణుడు నీ ప్రేమ పెన్నిధియైన సీతాదేవిని అపహరించుకొని పోయిన సమయము "వింద" ముహూర్తకాలము. ఆ విషయమును అతడు ఎఱుగడు. ఆ ముహూర్తము అతనికి మరణాంతకము. కనుక అతడు గాలమునకు చిక్కుకొనిన చేపవలె వెంటనే నశించిపోవుట నిజము"
--------------------------
ఈ విషయంలో శ్రీగీతా ప్రెస్ వారి వివరణ ఇలా ఉంది.
నష్టం ధనం విందతి (లభతే) అస్మిన్ - ఇతి వింద:
"వింద" ముహూర్తకాలమున నష్టమైన ధనం తప్పక యజమానికి భద్రముగా లభించును.
రౌద్ర: శ్వేతశ్చ మైత్రశ్చ తథా సారభట: స్మృత:|
సావిత్రో వైశ్వదేవశ్చ గాంధర్వ: కుతపస్తథా||
రౌహిణస్తిలకశ్చైవ 'విజయో' నైరృతస్తథా|
శంబరో వారుణశ్చైవ భగ: పంచదశ: స్మృత:||
ఈ పదునైదు (15)ను పగటి ముహూర్తములు. 11వదీయైన విజయ ముహూర్తమునకే 'విందము' అని నామాంతరము.

No comments:
Post a Comment