Tuesday, 13 February 2018

శ్రీహనుమ అవివాహితుడా లేక వివాహితుడా?



శ్రీమద్రామాయణం వేదకాలం నాటిది.  ఆనాడు వివాహం తరువాత భగవంతుడి ధ్యానం కనిపిస్తుందికానీ, యవ్వనంనుండే సన్యాసం కనిపించదు.

బౌద్ధ, జైన సంప్రదాయల తరువాత నుండే మనదేశంలో యవ్వనం నుండే సన్యాసం తీసుకునే సంప్రదాయం కనిపిస్తుంది.  ఉదాహరణకు:  చిన్న వయస్సులోనే దేశమంతా తిరిగి, చర్చలు జరిపి, దేశం నుంచి విపరీతధోరణిలో పోతున్న బౌద్ధాన్ని తరిమివేసిన శ్రీ శంకరాచార్యులు.

సుందరకాండలోని శ్లోకమిది.   ఇది  సీత కోసం రావణుని అంత:పురంలో స్త్రీలందరినీ క్షుణ్ణంగా పరిశీలించి, అంతమంది నిద్రిస్తున్న పరస్త్రీలను పరిశీలంచడంవల్ల తనవల్ల ధర్మలోపం జరిగిందేమోనని శ్రీహనుమ మనస్సులోని మాట.

న హి మే పరదారాణాం దృష్టిర్విషయవర్తినీ|  

" పరసతులవిషయమున నాకెన్నడును విషయవాసనా దృష్టియే లేదు."

శ్రీ హనుమ ఆజీవన బ్రహ్మచారియే ఐతే స్త్రీలందరి విషయంలో నాకు చెడుదృష్టి లేదు అనేవాడు కానీ పరసతుల విషయంలో చెడు దృష్టిలేదు అని అనడు కద!

శ్రీమద్రామాయణంలో అంగదుడు, ఇంద్రజిత్తు వంటి యోధుల ప్రస్తావన కూడా ఉంది.  వారుకూడా వివాహితులా లేక అవివాహితులా అనేది ఎక్కడా వాల్మికి మహర్షి చెప్పలేదు.

అంటే వారివిషయంలో కూడా శ్రీహనుమ విషయంలో అనుకున్నట్లు అవివాహితుడని అనుకుందామా?

No comments:

Post a Comment