Wednesday, 2 September 2015

గణపతి అంటే భగవంతుడేనా?

క్రింద ఇచ్చిన శ్లోకం అందరికి తెలిసినదే.  శ్రీగణపతి ఆరాధన చేసేటప్పుడు ఈ శ్లోకమే చదువుతారు.

ఓం గణానాం త్వా గణపతి గ్o హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం|
జేష్టరాజం బ్రహ్మణాo  బ్రహ్మణ స్పత  ఆన: శృణ్వన్నూతిభి: సీదసాదనం||
ఓం మహాగణాధిపతయే నమ:

(ఋగ్వేదము (2.23.1))

"ఓం, గణములన్నింటికిని అధిపతైన ఓ గణపతి!  నీకు మా హవిస్సులను సమర్పిస్తున్నాము.  నీవు జ్ఞానులకే జ్ఞానివి, కీర్తికి పరాకాష్ట స్థితివి.  నీవు బ్రహ్మత్వం పొందినవారికే రాజువు (స్వయంభూ).  నీవే బ్రహ్మవు (శుద్ధ జ్ఞానమే), నీవు పవిత్రమైన ఓంకారానివి!  మా ప్రార్థనలను ఆలకించి పవిత్రమైన యజ్ఞస్థలిలో నీ ఆసనం స్వీకరించు"

"మహాగణాధిపతికి నమస్కారము. "

ఈ ఆరాధనా శ్లోకము చాల సంవత్సరాలనుండి వింటున్నాను.  నన్ను శ్రీగణపతి ఆరాధన చేయమని 2001లో ఒక జ్యోతిష్యుడు చెప్పాడు.   ఏ పూజ విధానం అనుసరించాలో,  ఎలా చెయ్యాలో చెప్పలేదు.

అన్నిచోట్ల వినిపించే "ఓం గం గణపతేయే నమ:" అనే మంత్రాన్నే స్వీకరించి రోజు కొన్ని సార్లు జపం చేస్తూ వచ్చాను.

ఐతే గణపతి పురాణాల్లో తప్ప, అక్కడక్కడ విన్న వేదకాలంనాటి కథలలోను, తరువాత చదివిన శ్రీమద్రామాయణంలోను కనిపించలేదు, కాని కార్తికేయుని అన్నగా మాత్రం కథలు విన్నాను.


ఈ మధ్య పైన ఉటంకించిన శ్లోకాన్ని అదే పనిగా మననం చేస్తూంటే, "గణపతి", "జేష్టరాజం బ్రహ్మణం" అనే రెండు మనస్సును తొలిచేసాయి.

పురాణాల్లోతప్ప కనిపించని గణపతి ప్రస్తావన ఋగ్వేదంలో ఎలా వచ్చిందో అర్థంకాలేదు. (i) అసలు "గణపతి" అంటే శివుని గణాలకు మాత్రమే అధిపతియా,(ii)అసలు గణాలంటే ఎవరు, (iii) "జేష్టరాజం బ్రహ్మణం"లో "బ్రహ్మణం" అంటే ఏమిటి? అనే ప్రశ్నలు ఉదయించి చాల వేధించాయి.

మరి ఈ గణపతి ఎప్పటివాడు అని నాలో నేనే ప్రశ్నించుకుంటువచ్చాను.   అనేకమందిని ప్రశ్నించాను, అంతర్జాలంలో (Internet) అనేక చోట్ల వెతికాను.

ఆ మధనంలో స్ఫురించిన విషయాలేమిటంటే:

(1) "గణపతి" అంటే శివుని గణాలకు మాత్రమే అధిపతి కాదని, "గణములు" అంటే అన్ని రకాల గణములు - దేవ, మనుష్య, రాక్షస, ఇతర జీవులన్ని-- అయి ఉండవచ్చునని అనిపించింది.  అన్ని జీవరాశులకు అధిపతి అంటే అతను "భగవంతుడే" తప్ప వేఱొకరు కారేమోననిపించింది.

పురాణాల్లోతప్ప మనకు తెలిసిన  గణపతి ప్రస్తావన కనిపించదు కానీ, "పితామహుడైన బ్రహ్మ" ప్రస్తావన వేదాలలో కనిపిస్తుంది.

(2)   "జేష్టరాజం బ్రహ్మణం" "బ్రహ్మ"లలో జేష్టుడైన రాజు అనుకుంటే, "బ్రహ్మ" అనే పదం ఒక జ్ఞానిని సూచిస్తూ చెప్పబడిందా అని అనిపించింది.  జ్ఞానులకు రాజు బృహస్పతి తప్ప వేరెవరు?

Image result for spirituality

No comments:

Post a Comment