ఎంతోమంది భక్తులు,జ్ఞానులు శ్రీరామతత్వం గురించి వారు అనుభవించి చెప్పారు. క్రొత్తగా చెప్పేది ఏముంటుంది?
శ్రీమద్రామాయణంలో తరువాతికాలంలో చొప్పించబడిన శ్రీరాముని భగవదవతార వర్ణనలు, పిట్టకథలు మొదలైనవి ప్రక్కన పెడితే, రామాయణం ప్రధానంగా వేదసంప్రదాయాలకనుగుణమైన ధర్మాచరణను నొక్కి చెప్పింది.
1. విగ్రహారాధన ఆకాలంలో లేనే లేదు.
2. శ్రీమద్రామాయణం అంటే అయోధ్యనుంచి రావణుని లంక వరకు జరిగిన శ్రీరాముని ప్రయాణం, రావణునితో యుద్ధం, రావణవథ, పట్టాభిషేకం మాత్రమేనా?
3. స్వార్ధపూరితమైన మాటలు, చర్యలు శ్రీమద్రామాయణంలోకూడా కనిపిస్తాయి.
4. వేదసంప్రదాయాలకనుగుణమైన జీవనం గడుపుతూ, శక్తి ఉన్నా ఒదిగి ఉండే శ్రీహనుమలాంటివారి (దక్షిణాచారులు) ప్రస్తావన ఉంది. వేదసంప్రదాయాలకు వ్యతిరేకమైన జీవనాలకు అలవాటుపడి, తక్కువ సమయంలోనే మానవాతీతశక్తులు సంపాదించి (వామాచారులు),కౄరమైన మనస్తత్వంతో ప్రపంచాన్నే ఏలాలనుకునే రావణుడు, ఇంద్రజిత్తులాంటివారి ప్రస్తావన ఉంది.
5. శ్రీమద్రామాయణం ఎప్పుడు జరిగిందంటే, ఖచ్చితమైన ఆధారాలు ఎవరు చూపలేరు. వేదాలను సరిగ్గా అర్థం చేసుకోలేక, భగవత్తత్వాన్న అర్థం చేసుకోవడమంటే కొన్ని క్రతువులు చేయడమేనన్న స్థాయికి దిగజారిన సమయంలో వచ్చిన బౌద్ధం వేదాలనే కాదంది.
6. బౌద్ధ రచనలలో శ్రీరాముని ప్రస్తావన లేకపోతే, రామాయణమే జరగలేదంటామా? రామాయణం ఒక కట్టుకథే అనేద్దామా?
7. భగవంతుడి స్వరూపాలుగా భావించబడిన మహనీయులు రామాయణం జరిగిందన్నారు. సత్యమే పలికే ఆ మహనీయుల మాటలను కొటిపడేద్దామా?
8. శ్రీరాముడు లేని సీతనా, సీతలేని రామాయణమా? రామాయణమంటే, సీతారాముల ప్రయాణమే! నిష్కామకర్మ చేసి చూపించిన శ్రీహనుమలేక రామాయణం ఊహించుకోగలమా? లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరసైన్యం లేని యుద్ధం కుదురుతుందా?
9. కాబట్టి రామాయణం అంటే "ధర్మం యొక్క ప్రయాణం"
No comments:
Post a Comment