అనేకమంది ఋషులు సవితృ గురించి అన్నింటికి మూలం, సర్వస్వతంత్రుడుగా, పురుషశక్తిగ ఋగ్వేదంలో చెప్పారు. స్త్రీశక్తి పరంగా దేవమాత అదితిని స్తుతించారు.
భౌతికంగా సవితృ ఆరాధన అంటే, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికి ఉదయిస్తూండగ/అస్తమిస్తుండగ అర్ఘ్యం ఇవ్వడం, సావిత్రీమంత్ర జపం చేయడం ప్రాచుర్యంలో ఉంది.
అదే ఋగ్వేదంలో సోమరసం గురించి ప్రస్తావన ఉంటుంది. 9వ మండలం మొత్తం (అనేకమంది ఋషులు కూర్చిన 114 సూక్తాలు) అన్నింటిని పునీతం చేసే సోమం గురించే - pavamānaḥ somaḥ ఉంటుంది.
----------
ఋగ్వేదం తరువాత వచ్చిన చాలమంది సాధకులు, నేటి కాలానికి సంబంధించిన అనేకమంది సాధకులు, పాశ్చాత్య ఋగ్వేద అనువాదకులు, ఈ సోమరసాన్ని భౌతికంగ దొరికే ఒక తీగ రసమని వ్రాసారు.
శ్రీ అరవింద యోగి వంటివారు ఈ సోమరసాన్ని భౌతికంగ దొరికే ఒక తీగరసమనికాక, సాధకుడు ఆధ్యాత్మికంగ అత్యున్నతస్థాయిని చేరినపుడు కలిగే ఆత్మసాక్షాత్కారం తాలుకు దివ్య అనందాన్ని, అన్నింటిని పునీతం చేసే సోమంగా చెప్తారు.
---------
ఆధ్యాత్మికపరంగ చూస్తే, సూర్యుడు/సవితృ అనుగ్రహాన్ని పొందడం ఆత్మసాక్షాత్కారంగా భావిస్తే, తత్ఫలితంగా లభించే దివ్యానందాన్ని సోమరసాన్ని త్రాగడంగ భావించవచ్చును.
ఈ సోమాన్ని సూర్యుడి కుమార్తెగ - సూర్యస్య దుహితా - ప్రస్తుతించారు.
పునాతి తే పరిస్రుతం సోమం సూర్యస్య దుహితా । వారేణ శశ్వతా తనా ॥ (ఋగ్వేదం 9.1.6)
---------
అన్నింటిని పునీతం చేసే ఈ సోమం, సత్యాన్వేషణ చేసేవారిని అనుగ్రహిస్తుందని ఋగ్వేదం చెబుతోంది.
ఏష దేవో విపన్యుభిః పవమాన ఋతాయుభిః । హరిర్వాజాయ మృజ్యతే ॥
(ఋగ్వేదం 9.3.3)
ఋతం అంటే సత్యం అని.
---------
అంటే, ఆధ్యాత్మికంగ ఎదగాలన్నా, ఆత్మసాక్షాత్కారం అనుభవించాలన్నా, సాధకుడు సత్యానికి కట్టుబడి ఉండాలని ఋషులు చెబుతున్నారు.
ఇదే విషయాన్ని వాల్మికి మహర్షి శ్రీరాముడు సత్యవంతుడు, ధర్మాత్ముడు అని చెప్పడంవల్ల, సాధకులకు సత్యపాలన ప్రాధాన్యం గురించి చెప్పారు.
ధర్మజ్ఞః సత్యసన్ధశ్చ శీలవాననసూయకః |
క్షాన్తః సాన్త్వయితా శ్లక్ష్హ్ణః కృతజ్ఞో విజితేన్ద్రియః ||
No comments:
Post a Comment