Thursday, 29 June 2023

సీతా, లక్ష్మణులు శ్రీరాముని గురువుగా భావించి అనుసరించారా?

 


ఒక విషయం నేర్చుకోవడానికి గురువును శిష్యుడు అనుసరించే పద్ధతులలు అనేకమున్నాయని పెద్దలు చెబుతారు.

--------

·      గురువు ఉన్నంతకాలం గురువునే అంటిపెట్టుకుని ఉండి శుశ్రూషలు చేస్తూ, సాధన చేసుకునేవారు కొందరు.

·   గురువు చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకుని, గురువుకు దూరంగా ఉండి, సాధన చేసుకునేవారు కొందరు.

·       గురువే సర్వస్వమని భావించి, గురువు రూపాన్ని స్మరిస్తూ, సాధన చేసుకునేవారు కొందరు.

·       గురువునే అంటిపెట్టుకుని ఉండి శుశ్రూషలు చేస్తూ, కొంతకాలం తరువాత గురువు అనుమతితో  గురువుకు దూరంగా ఉండి, సాధన చేసుకునేవారు కొందరు.

ఇంకా మరిన్ని పద్ధతులు ఉండవచ్చును.

-----------

1)   సీత

వేరు వేరు సందర్భాలలో సీత చెప్పిన మాటలు పరిశీలిద్దాము.


i) వనవాసానికి బయలుదేరేటప్పుడు, శ్రీరాముడు సీతను అయోధ్యలోనే ఉండిపొమ్మని చెప్పినపుదు, సీత అన్న మాట ఇది.  అందువలన తాను శ్రీరాముని అనుసరిస్తానని అంటుంది.

ఇహ లోకే పితృభిర్ యా స్త్రీ యస్య మహా మతే |

అద్భిర్ దత్తా స్వధర్మేణ ప్రేత్య భావే అపి తస్య సా || 2-29-17

" ప్రపంచంలో, నైతిక నియమావళి ప్రకారం తల్లిదండ్రులు ఒక స్త్రీని ఎవరికి నీటితో దానంగ ఇస్తారో, స్త్రీ మరణం తర్వాత కూడా అతనికి మాత్రమే చెందుతుంది."


ii)   శ్రీరామునితో తన అరణ్యవాస ప్రయాణం గురించి శ్రీహనుమంతునితో చెప్పేటప్పుడు, సీత ఇలా అంటుంది.


సా అహమ్ తస్య అగ్రతః తూర్ణమ్ ప్రస్థితా వన చారిణీ || 5-33-27

హి మే తేన హీనాయా వాసః స్వర్గే అపి రోచతే |


"అయినప్పటికీ నేను అడవిలో నివసించాలని నిర్ణయించుకున్నాను, అతను లేని స్వర్గానికి కూడా ఇష్టపడను కాబట్టి నేను అతని కంటే త్వరగా నడిచాను.


iii) శ్రీహనుమంతుడు శింశుపా వృక్షంపైనుండి శ్రీరామ కథను వినిపించినపుడు సీత మనోగతం.

రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచిన్త్యా వాచా బ్రువతీ తమేవ |

తస్యానురూపం కథాం తదర్థా మేవం ప్రపశ్యామి తథా శృణోమి || 5-32-11


"నేను రాముని గురించి మాత్రమే మనస్సుతో ఆలోచిస్తున్నాను, మరియు ఎల్లప్పుడూ 'రామా! రామ!'అని అంటున్నాను. అందువల్ల, అతని ఆలోచనకు అనుగుణంగా నేను ఒక కథను చూస్తున్నాను మరియు వింటున్నాను."

 

ఆనాటి మర్యాదలననుసరించి, సీత శ్రీరాముని దైవంగా, గురువుగా భావించి అనుసరించిందని అనుకోవాలి.

------

2)   లక్ష్మణుడు

లక్ష్మణుని విషయానికి వస్తే, ఆయన శ్రీరాముని ఒక గురువుగా భావించి అనుసరిస్తూండేవాడని అర్థం చేసుకోవచ్చును.


శ్రీహనుమంతుడు శింశుపా వృక్షంపైనుండి సీత ఇబ్బందులు గమనించి తనలోతాను అనుకున్న మాటలు.

మాన్యా గురువినీతస్య లక్ష్మణస్య గురుప్రియా।

యది సీతాఽఽపి దుఃఖార్తా కాలో హి దురతిక్రమః।।5.16.3।।

"గౌరవింపదగిన, గురువుల దగ్గర శిక్షణ పొందిన, లక్ష్మణుని గురువుకి  ప్రీతిపాత్రమైన సీత ఇలా బాధపడుతుంటే, కాలాన్ని అతిక్రమించడం కష్టమని తెలుస్తోంది."

--------

ఇక్కడ లక్ష్మణస్య గురుప్రియా - లక్ష్మణుని గురువుకి  ప్రీతిపాత్రమైన సీత అన్నది ప్రధానమైనది.

లక్ష్మణుని గురువు వశిష్టుడైనా అయి ఉండాలి లేదా విశ్వామిత్రుడైనా అయి ఉండాలి.  ఐతే వారికి సీత ఏరకంగా   ప్రీతిపాత్రమవగలదు?  కాబట్టి వ్యక్తి సీతకు, లక్ష్మణునికి కూడా సన్నిహితుడై ఉండాలి.

దశరథుడై ఉండజాలడు, ఎందుకంటే ఆయనను శ్రీహనుమంతుడు చూడలేదు.

ఆయన తప్పనిసరిగ శ్రీరాముడు అయి ఉండాలి.  ఎందుకంటే శ్రీరామునికి లక్ష్మణుడు బహి:ప్రాణమని రామాయణం చెబుతోంది.

అంతేకాక శ్రీరాముదు విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్న అస్త్రవిద్య మొత్తం లక్ష్మణుడికి కూడా తెలుసును.  ఇది శ్రీరాముడు లక్ష్మణుడికి నేర్పకపోతే సాధ్యం కాదు.


కాబట్టి గురువు ఉన్నంతకాలం గురువునే అంటిపెట్టుకుని ఉండి శుశ్రూషలు చేస్తూ, సాధన చేసుకునే వర్గానికి చెందినవాడు లక్ష్మణుడు.

 


 

 

No comments:

Post a Comment